22-02-2026 03:24:32 PM
- న్యాయవాదుల రక్షణ చట్టం తీసుకురావాలి
-23 నుంచి పాదయాత్ర 27న సచివాలయం ముట్టడి
- విశ్వ రాష్ట్ర ఉద్యమంలో న్యాయవాదులది కీలక పాత్ర
- నాడు పాదయాత్ర చేస్తే హామీ ఇచ్చి గమ్ముగుండ్రు
- విలేకరుల సమావేశంలో బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు అనంతరెడ్డి
మహబూబ్ నగర్,(విజయక్రాంతి): న్యాయవాదులకు రక్షణ కల్పించాలని సంకల్పంతో ఎక్కడైతే పాదయాత్ర ముగించామో.. అక్కడి నుంచే సోమవారం నుంచి పున ప్రారంభిస్తామని మహబూబ్ నగర్ జిల్లా బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు అనంతరెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బార్ అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. న్యాయం కోసం న్యాయవాదులు నిరంతరం తపిస్తున్న గ్రామంలో కొందరు పనిగట్టుకుని న్యాయవాదులను హతమార్స్తున్నారని ఇది సరైన పద్ధతి కాదన్నారు. న్యాయవాదులకు రక్షణకు చట్టం తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
విజయ రెడ్డి, స్వప్న, ఖాధీర్ లతో పాటు ఎంతో మంది న్యాయవాదులను హతమార్చాలని, ఇవి తెలిసి చేసిన తెలియకుండా మరెన్నో హత్యలు జరిగి ఉన్నాయని పేర్కొన్నారు. న్యాయవాదులకు ప్రత్యేకంగా రక్షణ చట్టం లేకపోవడంతో ఇలాంటి దాడులు జరుగుతున్నాయని ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయవాదులకు రక్షణ చట్టం తీసుకురావాల్సిన బాధ్యత ఉంది అన్నారు. గతంలో న్యాయవాదులు పాదయాత్ర చేసి నా సమయంలో జిల్లాలోని ముగ్గురు ఎమ్మెల్యేలు భూత్పూర్ దగ్గరికి వచ్చి పూర్తిస్థాయిలో హామీ ఇవ్వడం జరిగిందని హామీ ఇచ్చి నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదన్నారు.
రేపటి నుంచి భూత్పూర్ నుంచి పాదయాత్ర ప్రారంభించి ఈనెల 27వ తేదీన సచివాలయంకు చేరుకుంటామని అప్పటిలోపు ప్రభుత్వం నుంచి సరైన హామీ వస్తే తమ పాదయాత్ర తాత్కాలికంగా వాయిదా వేసుకుంటామని తెలిపారు. ప్రభుత్వం పూర్తిస్థాయిలో బాధ్యతగా వ్యవహరి జీతంకు రక్షణ చట్టం తీసుకురావాలని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని బార్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు ఉమామహేశ్వరి, శ్రీధర్ రావు, మురళి కృష్ణ, రాఘవేందర్, ఎలియాస్, వినోద్, కృష్ణ దత్, కొప్పుల శ్రీను, సీ సబితా, వి జ్యోతి, ధనలక్ష్మి, టీ కృష్ణ తదితరులు ఉన్నారు.