పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు సముచిత స్థానం
షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్
నలుగురు షాద్ నగర్ మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం
షాద్ నగర్,(విజయక్రాంతి): షాద్ నగర్ మున్సిపల్ కార్యాలయంలో జరిగిన కో-ఆప్షన్ ఎన్నికల్లో నలుగురు కో-ఆప్షన్ సభ్యులను ఏకగ్రీవంగా ఎంపికయారు. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు మరియు ఇతర కౌన్సిలర్లు ఏకాభిప్రాయంగా వీరిని ఎన్నుకున్నారు. మున్సిపల్ కమిషనర్ సునీత రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం కో-ఆప్షన్ సభ్యులకు సన్మానించి, వారికి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి మాజీ జడ్పీటీసీ శ్యామ్ సుంధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు . ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కష్టపడ్డ వారిని కో ఆప్షన్ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు.
భవిష్యత్తులో మిగత వారికి సమయానుకూలంగా పార్టీలో సముచిత స్థానం కల్పిస్తాం అన్నారు. కో ఆప్షన్ సభ్యులు ఎన్నికైనవారు వీరే.. కాంగ్రెస్ యువజన నాయకుడు సయ్యద్ ఖదీర్, సీనియర్ నాయకుడు సుజీవన్ వావిలాల, మాజీ కౌన్సిలర్ పులిమామిడి శ్రీలత శ్రీశైలం గౌడ్, అదేవిధంగా కాంగ్రెస్ యువ నాయకుడు చిన్న తల్లి ఉషారాణి గిద్దలూరనీ ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్,వైస్ ఛైర్మన్ అంధే మోహన్ ముదిరాజ్, కమిషనర్ సునీత రెడ్డి, కౌన్సిలర్ లు, కో ఆప్షన్ సభ్యులు ఉన్నారు.






