06-02-2026 12:00:00 AM
మల్కాజ్గిరి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అమరేందర్‌రెడ్డి
కుషాయిగూడ, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): రాష్ట్రంలో అడ్వకేట్‌లకు రక్షణ కల్పిం చాలని మల్కాజ్గిరి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అమరేందర్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చేవెళ్లలో అడ్వకేట్ స్వప్న హత్యను నిరసిస్తూ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శనలు నిర్వహించారు.
ఈ సందర్భంగా కుషాయిగూడలోని మేడ్చల్ మల్కా జిగిరి జిల్లా కోర్టు నుంచి ఈసీఐఎల్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వ హించి అడ్వకేట్‌లకు రక్షణ కల్పించాలని నినాదాలు చేశారు. అనంతరం అడ్వకేట్ల రక్షణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ కుషా యిగూడ ఇన్స్పెక్టర్ భాస్కర్ రెడ్డికి విన తి పత్రాన్ని అందజేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి బారో అసోసియేషన్ కమిటీ సభ్యులు, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.