calender_icon.png 14 February, 2026 | 1:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రెగ్నెన్సీతోనే షూటింగ్ పూర్తిచేశా

14-02-2026 12:01:24 AM

లావణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ జంటగా నటించిన చిత్రం ‘సతీ లీలావతి’. తాతినేని సత్య దర్శకత్వంలో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్లపై నాగ మోహన్ నిర్మించారు. ఈ సినిమాను మార్చి 6న విడుదల చేయబోతోన్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు మూవీ టీమ్ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ ప్రెస్‌మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించింది.

ఈ సందర్భంగా లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ.. “సతీ లీలావతి’ ఇది పూర్తిగా వినోదాత్మక చిత్రం. ఈ మూవీ అందరికీ నచ్చుతుంది. భార్యాభర్తలిద్దరూ ఎప్పుడూ ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఉండాలి.. దంపతులిద్దరూ స్నేహితులుగా ఉంటే జీవితం ఆనందంగా సాగుతుందనే విషయాన్ని ఈ చిత్రంతో చెప్పబోతున్నాం. ఈ సినిమా ప్రారంభించినప్పుడు నేను గర్భవతిని. తొలిరోజే డైరెక్టర్ ఒక యాక్షన్ సీన్‌ను ప్లాన్ చేశారు. నాకు భయం వేసింది.. దర్శకుడి దగ్గరకు వెళ్లి నేను ప్రెగ్నెంట్ అని చెప్పా.. ఆయన షాక్ అయ్యారు. అప్పటివరకూ ఎవరికీ తెలియదు.

ఆ తర్వాత కూడా ఎవరికీ చెప్పలేదు. జాగ్రత్తగా చూసుకున్నారు. ప్రెగ్నెన్సీతోనే మూడు నెలల్లో షూటింగ్ పూర్తి చేశా. దర్శక, నిర్మాతల సపోర్ట్ వల్లే అంత త్వరగా చిత్రీకరణ పూర్తి చేయడం సాధ్యమైంది” అని చెప్పారు. దర్శకుడు సత్య మాట్లాడుతూ.. ‘కమల్‌హాసన్ చేసిన ‘సతీ లీలావతి’తో మాత్రం నా సినిమాను పోల్చను. అందరికీ కనెక్ట్ అయ్యేలా ఈ సినిమా తీశాం’ అని తెలిపారు. “నిర్మాతగా నాకు ‘సతీ లీలావతి’ తొలిచిత్రం. ఈ ప్రయాణంలో ఎన్నో నేర్చుకున్నా” అని నిర్మాత నాగమోహన్ చెప్పారు. “పాత ‘సతీ లీలావతి’ ఎంత పెద్ద హిట్ అయిందో మా ఈ సినిమా కూడా అంతే హిట్ అవ్వాలని కోరుకుంటు న్నాన”ని నటుడు సప్తగిరి తెలిపారు.