6 May, 2026 | 11:18 AM

చిన్న ఓదాల గ్రామంలో బారీ వర్షం.. కొట్టుకుపోయిన ఆరబోసిన ధాన్యం

06-05-2026 10:26 AM

మార్కెట్ సెంటర్ లో  కొట్టుకుపోయిన ఆరాబోసిన ధాన్యం

మంథని,మే 06(విజయ క్రాంతి): మంగళవారం అర్ధరాత్రి కురిసిన వడగండ్ల వర్షానికి మంథని మండలంలోని రైతులపై  తీవ్ర ప్రభావం చూపింది. చేతి కచ్చిన పంటను కొనుగోలు కేంద్రాలకు తరలించి ఉంచగా భారీ వర్షానికి ధాన్యం తడిసి ముద్దయింది. మంథని మండలంలోని చిన్న ఓదాల  గ్రామంలో  ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులు ఆరబోసిన వరి ధాన్యం వర్షానికి కొట్టుకుపోయి రైతులకు తీవ్ర నష్టం జరిగింది. గ్రామానికి చెందిన  రైతులు మూడెత్తుల విజయ్ కుమార్, మోతుకు అశోక్, దువ్వాసి సదయ్య, గువ్వల మల్లేష్, జంజర్ల మొగిలి, మూడెత్తుల చంద్రయ్య, దాసరి ప్రశాంత్, గువ్వల లింగయ్య తో పాటు చాలా మంది రైతుల వరి ధాన్యం కొట్టుకుపోయింది.   నష్టపోయిన రైతులను ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని సర్పంచ్ నాగుల శారద రాజయ్య అధికారులను కోరారు.