14-02-2026 12:00:00 AM
శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం ‘విష్ణు విన్యాసం’. నూతన దర్శకుడు యదునాథ్ మారుతిరావు తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు జీ నిర్మిస్తున్నారు. నయన్ సారిక కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సత్య, బ్రహ్మాజీ, ప్రవీణ్, మురళీశర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, సత్యం రాజేశ్, శ్రీనివాస్ వడ్లమాని, గోపరాజు రమణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని త్వరలోనే థియేటర్ల ద్వారా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం మేకర్స్ సెకండ్ సింగిల్ ‘మొదలే మొదలే..’ను విడుదల చేశారు.
‘విన్నాలే.. వింటున్నాలే మనసున నీ మాట.. అన్నాలే.. అంటున్నాలే బదులుగ నా మాట.. మొదలే మొదలే మన కథ మొదలే.. మనకూ మనకూ ఇకపై రంగుల కలలే...’ అంటూ సాగుతోందీ గీతం. రధన్ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఈ పాటకు రామజోగయ్యశాస్త్రి సాహిత్యం అందించగా మధుశ్రీ, నరేశ్ అయ్యర్ ఆలపించారు. ఈ గీతంలో శ్రీవిష్ణు, నయన సారిక కెమిస్ట్రీ ఆకట్టుకుంది. ఈ చిత్రానికి సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీని అందించగా, ఏ రమణాంజనేయులు ఆర్ట్ డైరెక్టర్‌గా, కార్తికేయన్ రోహిణి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.