విద్యార్థులపై లాఠీ చర్చి అమానుషం
పీడీఎస్యూ నేత మహేష్
బెల్లంపల్లి,(విజయక్రాంతి): విద్యార్థులపై లాఠీ చేయడం అమానుషమని పీడీఎస్ యూ (విజృంభణ )జిల్లా ఆర్గనైజింగ్ కమిటీ కన్వీనర్ కంబాల మహేష్ ఖండించారు. ఈమేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. నీట్ పేపర్ లీక్ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి,సోనమ్ వాంగ్‌చుక్ పిలుపులో భాగంగా చలో పార్లమెంట్ కి వెళ్తున్న యువకులపై లాఠీఛార్జ్ చేయడాన్ని ఖండించంచాలనీ డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీక్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 20 మంది విద్యార్థులకు న్యాయం చేయాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేపర్ లీకేజ్ కి బాధ్యత వహించి రాజీనామా చేయాలన్నారు.
గత కొన్ని రోజులుగా అనేక రూపాల్లో ఆందోళన జరుగుతున్నప్పటికీని కేంద్ర ప్రభుత్వం నిమ్మకునీరు ఎత్తినట్లు వ్యవహరించడం సరైంది కాదనిమండిపడ్డారు. విద్యార్థుల పట్ల నిర్లక్ష్య వైఖరి వీడనాడి ధర్మేంద్ర ప్రధాన్ ను వెంటనే బర్త్ రఫ్ చేయాలని, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోనమ్ వాంగ్‌చుక్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే తన డిమాండ్లపై కనీసం చర్చించకుండా బలవంతంగా పోలీసు బలగాలు వచ్చి దీక్షను విరమింప చేయడం దేనికి నిదర్శనమన్నారు. సోనం వాంగ్ చుక్ పిలుపులో భాగంగా యువకులు పార్లమెంటు ముందు నిరసనకు బయలుదేరిన క్రమంలో యువకులపై పోలీసులు విచక్షణ రహితంగా లాఠీ చార్జి చేయడం సరైన కాదన్నారు.
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 90కి పైగా పేపర్ లీక్ ఘటనలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. విద్యా వ్యవస్థను కార్పొరేట్ శక్తులకు అప్పగించే కుట్ర జరుగుతోందని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే వారిని దేశద్రోహులుగా ముద్ర వేస్తూ జైళ్లలో నిర్బంధిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నీట్ పేపర్ లీక్ కారణంగా నష్టపోయిన విద్యార్థులకు తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థి వ్యతిరేక విధానాల అవలంబిస్తూ విద్యార్థి జీవితాలతో చెలగాటమాడుతున్న కేంద్ర ప్రభుత్వం వెంటనే విద్యార్థులకు న్యాయం చేయాలని, లేని పక్షంలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్ధి సంఘం (పి డి ఎస్ యు విజృంభణ) ఆధ్వర్యంలో ప్రజాస్వామిక వాదుల, మేధావుల, విద్యార్థి యువకులుతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.






