పంచాయతీ వారు పెంచిన మొక్కలు కాలిపోతున్నాయి
17-06-2026 06:00 PM
బోథ్,(విజయక్రాంతి): మండల కేంద్రానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పిప్పల్ దరి గ్రామం వరకు రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలు ఖాళీ బూడిదవుతున్నాయి. పొలం పనులు చేపట్టే సమయంలో కొంతమంది రైతులు చేను గట్లకూ నిప్పు పెట్టడంతో నాటిన మొక్కలకు అగ్ని అంటుకుంటుంది. దీంతో రోడ్డుకు ఇరువైపులా ఉన్న మొక్కలు అగ్ని ప్రమాదంలో ఆహుతి అవుతున్నాయి. అయితే గతంలో పనిచేసిన గ్రామ కార్యదర్శి మొక్కలను కాల్చవద్దని రోడ్డు పక్కన ఉన్న రైతులకు ఎన్నిసార్లు చెప్పినా వినకుండా కొట్టి కాల్చివేశారని గ్రామస్తులు అంటున్నారు.






