17 June, 2026 | 8:31 PM

Breaking News

లయన్స్ క్లబ్ సెంటినరీ కాలనీ ఉపాధ్యక్షుడిగా బుద్దారి బుచ్చన్న నియామకం

17-06-2026 07:10 PM

పెద్దపల్లి,(విజయక్రాంతి): లయన్స్ క్లబ్ ఆఫ్ సెంటినరీ కాలనీ 2026-27 సంవత్సరానికి గాను నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ఈ క్రమంలో క్లబ్ ఉపాధ్యక్షుడిగా ప్రముఖ సామాజిక కార్యకర్త, సేవా దృక్పథం కలిగిన వ్యక్తిగా పేరుపొందిన లయన్ బుద్దారి బుచ్చన్న నియమితులయ్యారు.

నిరంతర ప్రజాసేవలో బుచ్చన్న

సమాజంలో అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం, విద్య మరియు వైద్య రంగాల్లో బుద్దారి బుచ్చన్న చేస్తున్న సేవలు ఎనలేనివని క్లబ్ సభ్యులు కొనియాడారు. కేవలం పదవిగానే కాకుండా, బాధ్యతగా భావించి గత కొంతకాలంగా ఆయన నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు అందరికీ ఆదర్శప్రాయమని వారు అభిప్రాయపడ్డారు.

అభివృద్ధికి కృషి చేస్తా

నూతన ఉపాధ్యక్షుడు బుచ్చన్న ఈ సందర్భంగా బుద్దారి బుచ్చన్న మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన క్లబ్ పెద్దలకు, సభ్యులకు ధన్యవాదాలు. క్లబ్ లక్ష్యాలకు అనుగుణంగా, రాబోయే ఏడాదిలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టడానికి, క్లబ్ ప్రతిష్టను జిల్లా స్థాయిలో మరింత పెంచడానికి నా వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.

యువతను సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములను చేయడమే తన ప్రాధాన్యత అని ఆయన స్పష్టం చేశారు. ఈ నియామకం పట్ల స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు బుచ్చన్న  శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేస్తూ, ఆయనకు ఘనంగా అభినందనలు తెలియజేశారు.