జిజాబాయిని ఆదర్శంగా తీసుకోవాలి: డాక్టర్ అశోక్ మహుల్కర్
వాంకిడి,(విజయక్రాంతి): మరాఠా సామ్రాజ్య నిర్మాత, వీరనారి రాజమాత జిజాబాయి (జిజావు) 352వ వర్ధంతి వేడుకలను వాంకిడి మండల కేంద్రంలోని జేత్వాన్‌లో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.భారతీయ బౌద్ధ మహాసభ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ అశోక్ మహుల్కర్ మాట్లాడుతూ... ఛత్రపతి శివాజీ మహారాజ్ తల్లి అయిన జిజాబాయి స్వరాజ్య దీక్షతో, సామాజిక న్యాయమే లక్ష్యంగా పాలన సాగించారని కొనియాడారు. నేటి తల్లులు ఆమెను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షుడు దుర్గం శ్యామ్‌రావు, సమతా సైనిక దళ్ జిల్లా అధ్యక్షుడు దుర్గం సందీప్, ఆర్గనైజర్ రోషన్, సురేష్, భారతీయ బౌద్ధ మహాసభ మండల అధ్యక్షుడు దుర్గం దుర్గాజీ, అరే కుల సంఘం నాయకుడు మందొకర్ విలాస్, మాలి సంఘం సభ్యుడు మోటిరాం తదితరులు పాల్గొన్నారు.






