గత పాలకుల పదేళ్ల కాలంలో ఎన్నో విధ్వంసాలు
- తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్
హుజూర్ నగర్: గత పాలకుల పదేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో విధ్వంసాలుజరిగాయని తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు,మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ సూర్యాపేట జిల్లా నూతన కార్యాలయం ప్రారంభించి మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధి ప్రజా సంక్షేమం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని అన్నారు. ప్రజల ఆకాంక్షలకు దూరంగా ఉన్న అసమర్థ ప్రభుత్వంగా ప్రస్తుత ప్రభుత్వాన్ని ఆయన అభివర్ణించారు. టీఆర్ఎల్డీని యువతను స్వచ్ఛమైన, పారదర్శకమైన రాజకీయాల్లోకి ప్రోత్సహించేందుకు నిజాయితీ, నిబద్ధతతో ప్రజాసేవ చేయడానికి పునరుద్ధ రించామని తెలిపారు.
రాబోయే స్థానిక సంస్థలు, శాసనసభ,పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎల్డీ పోటీ చేస్తుందని ప్రకటించారు. ఈనెల 27న వరంగల్ లో రాష్ట్రీయ లోక్ దళ్ జాతీయ అధ్యక్షులు, భారత ప్రభుత్వ నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత శాఖ కేంద్ర మంత్రి జయంత్ సింగ్ మార్గదర్శకత్వంలో భారీ ఉద్యోగ మేళాను లక్ష్యం కోసం- లక్ష సైన్యం పేరుతో ఒక ప్రత్యేక యువజన కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. మాజీ సైనికుల సహకారంతో తెలంగాణ యువతకు నాయకత్వ లక్షణాలు, దేశం పట్ల ప్రేమ గౌరవం మర్యాదను తెలియజేస్తామన్నారు.






