27 June, 2026 | 7:04 PM

Breaking News

అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •   పల్స్ పోలియోను విజయవంతం చేయండి   •   ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి   •   జగన్నాధపురంలో వనమహోత్సవం   •   శ్రీరంగవరం పట్టణంలో శ్రీ సీతారామచంద్ర స్వామి విగ్రహ ప్రతిష్టోత్సవం   •   పల్స్ పోలియోను విజయవంతం చేయండి   •   మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్స్ 15వ గ్రాడ్యుయేషన్ డే   •  

లంక జోరు.. ఒమన్ బేజారు

13-02-2026 12:50 AM

కొలంబో, ఫిబ్రవరి 12 : ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో శ్రీలంక జోరు కొనసాగుతోంది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విజయం సాధించింది. గ్రూప్-బీలో భాగం గా ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 105 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక పూర్తి ఆధి పత్యం చెలాయించగా.. ఒమన్ తేలిపోయింది. కనీస పోటీ కూడా పోటీనివ్వలేక పోయింది.

ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 225 పరుగులు చేసింది. అనంతరం ఒమ న్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 120 ప రుగు చేయగలిగింది. ఒమన్ ఇన్నింగ్స్‌లో  మొహమ్మద్ నదీం  మాత్రమే అర్ద సెంచరీతో రాణించాడు. ఈ విజయంతో గ్రూప్ -బీ నుంచి సూపర్ -8 అవకాశాలను మెరుగుపర్చుకోగా.. ఒమన్ వరుస ఓటముల తో ఇంటిదారి పట్టేందుకు రెడీ అయింది.