calender_icon.png 7 February, 2026 | 8:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొదురుపాకలో బస్టాండ్ కోసం స్థలం పరిశీలన

07-02-2026 05:55:48 PM

బోయినపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక ప్రజలు ఎంతగానో, ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్న బస్టాండ్ బస్ స్టాప్ సంబంధించి సమస్య పైనా ఆర్టీసీ ఆర్ఎం రాజు కొదురుపాకలో శనివారం స్థల పరిశీలన చేశారు. కొదురుపాక సర్పంచ్ డాక్టర్ కత్తెరపాక మండల సుధాకర్ పాలకవర్గం. కొదురుపాక డెవలప్మెంట్ కమిటీ సభ్యులు అందరూ కలిసి ఇక్కడ బస్టాండ్ నిర్మాణానికి సంబంధించి స్థలాన్ని పరిశీలించారు.

గతవారం క్రితం కొదురుపాక బస్టాండ్ నిర్మాణం  బస్టాప్ పైన రవాణా శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ సర్పంచ్ ఆధ్వర్యంలో కలిసి వినతిపత్రం ఇవ్వగా, సానుకూలంగా స్పందించి ఆర్ఎం ను సల పరిశీల చేయాలని ఆదేశించారు. అనంతరం ఆర్ ఎం కోదురుపాక గ్రామాన్ని సందర్శించి బస్టాండ్ నిర్మాణానికి సంబంధించిన అనుకూలతను పరిశీలించారు. ఆర్ఎం సూచన మేరకు పాలకవర్గంకు సంబంధించిన నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని సర్పంచ్ డా. కత్తెరపాక మంజుల సుధాకర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్  గోపాల్, వార్డు సభ్యులు సిద్ధాంతి దీక్షిత్, బలాగోని శ్రీనివాస్, సుద్దాల వేణు, విలేజ్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు బండి శ్రీనివాస్, కత్తెరపాక సుధాకర్, మైలారం శ్రీనివాస్, బాలగోని వెంకటేష్, బాలగోని అనిల్, రంగారావు, పందుల వెంకటేష్ కత్తెరపాక మని గ్రామ ప్రజలు పాల్గొన్నారు.