21-02-2026 04:36:08 PM
గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరం ముందుకు వద్దాం
ఉప్పల సాయినాథ్ మాజీ ఉపసర్పంచ్
బీబీపేట,(విజయక్రాంతి): బీబీపేట మండల కేంద్రానికి చెందిన ఉప్పల చంద్రకళ- చిన్న మల్లేశం జ్ఞాపకార్థం వారి సోదరుడు ఉప్పల విద్యా సాగర్ - పద్మ గ్రామానికి 10 గుంటల భూమిని స్మశానవాటిక కోసం కేటాయించి గ్రామపంచాయతీ పాలకవర్గానికి శనివారం అధికారికంగా అప్పగించారు. కనీసం అంత్యక్రియలు చేయడానికి గుంట భూమి లేని వారు చాలా మంది ఉన్నారని అట్టివారిని దృష్టిలో ఉంచుకుని ఈ భూమిని విరాళంగా ఇవ్వడం జరిగిందన్నారు. భవిష్యత్‌లో స్మశానవాటికలో అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి ఈ భూమి ఉపయోగపడనుంది.
స్మశాన వాటికలో అవసరమయ్యే మౌఖిక వసతులను కూడా ఏర్పాటు చేసుకోవచ్చని అన్నారు. గ్రామాభివృద్ధికి సహకరించినందుకు వారి కుటుంబానికి గ్రామ పాలక వర్గం కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాభివృద్ధి కోసం ముందుకు వస్తున్న ఇలాంటి సేవాభావం మరింత మందికి ఆదర్శంగా నిలుస్తుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఏదుల్ల సాద్విక - సాయినాథ్, ఉపసర్పంచ్ చందుపట్ల ప్రశాంత్ కుమార్, గ్రామ కార్యదర్శి రమేష్,వార్డు సభ్యులు కారబర్ సిద్ధిరాములు పాల్గొన్నారు.