27 July, 2026 | 3:07 AM

డా.జి.హరిచరణ్‌కు ‘ధన్వంతరి ఎక్సలెన్స్ అవార్డు’ ప్రదానం

27-07-2026 02:09 AM

ముషీరాబాద్, జూలై 26 (విజయక్రాం తి): అపోలో హాస్పిటల్, సికింద్రాబాద్, సీజన్స్ హాస్పిటల్స్, అంబర్పేట్లో సీనియర్ కన్సల్టెంట్ ఫిజీషియన్, డయాబెటాలజిస్ట్ డా. జి. హరిచరణ్కు వైద్య రంగంలో విశిష్ట సేవలకు గుర్తింపుగా ప్రతిష్ఠాత్మక ‘ధన్వంతరి ఎక్సలెన్స్ అవార్డు’ ను ప్రదానం చేశారు. హైదరాబాద్లోని కేశవ్ మెమోరియల్ ఎడ్యు కేషనల్ ఇన్స్టిట్యూషన్లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు డా. కె. లక్ష్మణ్ చేతుల మీదుగా అవార్డును అంద జేశారు.

రోగులకు నాణ్యమైన వైద్య సేవలు, మధుమేహ నియంత్రణ, నివారణ వైద్యంపై అవగాహన కల్పించడం, ఉచిత వైద్య శిబి రాల నిర్వహణ, ప్రజారోగ్య పరిరక్షణలో చేసిన సేవలను గుర్తించి ఈ పురస్కారం అందించారు. అలాగే వైద్య రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) వినియోగా నికి చేస్తున్న కృషిని కూడా ప్రశంసించారు. ఈ సందర్భంగా డా. జి. హరిచరణ్ మాట్లాడుతూ ఈ అవార్డును తన రోగులు, గురువులు, సహచర వైద్యులు, కుటుంబ సభ్యులకు అంకితం చేస్తున్నట్లు తెలిపారు.