10 March, 2026 | 5:00 AM

కొండనాగులలో లక్ష్మీచెన్నకేశవ స్వామి విగ్రహం, ధ్వజస్తంభ ప్రతిష్ఠ

10-03-2026 01:36 AM

బల్మూరు, మార్చి 9: నాగర్కర్నూల్ జిల్లా బల్మూరు మండలం కొండనాగుల గ్రామంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో సోమవారం విగ్రహం, ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించి స్వామివారిని ప్రతిష్ఠించారు.

ఈ కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్ర ముఖులు శ్రీ రామానుజ చిన్న జీయర్ స్వామి ముఖ్య అతిథిగా హాజరై భక్తులకు ఆధ్యాత్మిక ప్రవచనాలు అందించారు. ధర్మం, భక్తి, సేవా భావం గురించి వివరిస్తూ భక్తులకు ఆత్మీయ సందేశం అందించారు. ఆలయ అభివృద్ధి, సంస్కృతి పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ దంపతులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.కార్యక్రమంలో స్థానిక ప్రజలు, భక్తులు మరియు పలువురు ప్ర ముఖులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు సమర్పించారు. ఈ మహోత్సవం ఆలయ వైభవాన్ని మరింత పెంచేలా ఘనంగా నిర్వహించబడింది.