కల్కి చెరువు అలుగు వద్ద బారికేడ్లు ఏర్పాటు
05-08-2026 08:36 PM
బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలోని కల్కి చెరువు గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పూర్తిస్థాయిలో చెరువు నిండి అలుగు పారుతున్న నేపథ్యంలో ప్రమాదాలు జరగకుండా ప్రజల భద్రత దృష్ట్యా అలుగు ప్రాంతంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుడు కాసుల రోహిత్ మాట్లాడుతూ... ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా చెరువులో నీటి ప్రవాహం అధికంగా ఉందని, ప్రజలు ముఖ్యంగా చిన్నారులు అలుగు ప్రాంతానికి దూరంగా ఉండి అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్, మున్సిపల్ సిబ్బంది పాల్గొని బారికేడ్ల ఏర్పాటును పర్యవేక్షించారు.






