యువత దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలి
బల్మూరు, మార్చి 9: యువత దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. సోమవారం మండలంలోని కొండనాగుల శ్రీ ఉమామహేశ్వర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్2026 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ దేశాన్ని వికాసపథంలో ముందుకు తీసుకెళ్లే బాధ్యత యువతపై ఉందన్నారు. 50 ఇయర్స్ అఫ్ ఎమర్జెన్సీ లెసన్స్ ఫర్ ఇండియన్ డెమోక్రసీ అనే అంశంపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు.విద్యార్థులు తమ ప్రతిభను, నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చేసుకుని సమాజానికి సేవ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, ప్రజాప్రతినిధులు, నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు.




