5 August, 2026 | 9:57 PM

కాళేశ్వరం అంగన్వాడీ కేంద్రంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు

05-08-2026 08:55 PM

కన్నుల పండుగగా చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం,, గర్భిణులకు శ్రీమంతాలు

నవజాత శిశువుకు తల్లిపాలే శ్రీరామ రక్ష

భూపాలపల్లి/కాళేశ్వరం,(విజయక్రాంతి): మహాదేవపూర్ మండల పరిధిలోని కాళేశ్వరం గ్రామంలో ఐసిడిఎస్ఈవో స్పందన ఆధ్వర్యంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉపసర్పంచ్ సుధీర్ కుమార్ విచ్చేశారు. మహదేవపూర్ ఐసిడిఎస్ ఈవో స్పందన మాట్లాడుతూ ప్రసవం తర్వాత గంటలోపు పట్టించే  ముర్రుపాలు ఎల్ జి జి, ఎల్ జి ఏ యాంటీబాడీలను కలిగి ఉంటాయి.

కావున అత్యంత వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉంటాయి. తల్లిపాలు మాత్రమే కల్తీ లేని సంపూర్ణ ఆహారం కావున ఆరు నెలల లోపు బిడ్డకు కేవలం తల్లిపాలు అందించాలని కనీసo రెండున్నర సంవత్సరాల వరకు ఇతర అనుబంధ పోషకాహారం తోపాటు కొనసాగించవలసిన ఆవశ్యకతను తెలియజేశారు. ఉత్సవాల్లో భాగంగా ఇద్దరు గర్భిణులకు శోభాయమానముగా శ్రీమంత వేడుకలను నిర్వహించారు. తొలిసారి తినిపించు అన్నప్రాశన తదుపరి అక్షరాభ్యాసం వేడుకలను అందరి చేతుల మీదుగా వేడుకగా జరిపారు.