5 August, 2026 | 9:30 PM

కోదాడ ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు వెంటనే నిర్వహించాలి

05-08-2026 08:43 PM

* కోదాడ సంఘానికి కొత్త కార్యవర్గం కోసం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాలని జిల్లా అధ్యక్షుడు వెంపటి వెంకటేశ్వరరావుకు వినతి

కోదాడ,(విజయక్రాంతి): కోదాడ పట్టణ ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలను ఎలాంటి జాప్యం లేకుండా తక్షణమే నిర్వహించాలని కోరుతూ పలువురు ఆర్యవైశ్య నాయకులు సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు వెంపటి వెంకటేశ్వరరావుకు మంగళవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కోదాడ పట్టణ ఆర్యవైశ్య మహాసభకు కొత్త కార్యవర్గాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకునేందుకు వెంటనే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాలని కోరారు.

ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా,నిష్పాక్షికంగా నిర్వహించి ప్రతి అర్హ సభ్యుడికి పోటీ చేసే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. వినతిపత్రాన్ని స్వీకరించిన జిల్లా అధ్యక్షుడు వెంపటి వెంకటేశ్వరరావు సభ్యుల అభిప్రాయాలను గౌరవిస్తున్నామని, త్వరలోనే సంబంధిత నాయకులతో చర్చించి ఎన్నికల నిర్వహణకు అవసరమైన చర్యలు చేపట్టేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో బండారు శ్రీనివాసరావు, చల్లా విజయ్ శేఖర్, ఇమ్మడి సతీష్ బాబు, సేకు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు