నిరంతర చికిత్స ద్వారా హెచ్‌ఐవీ వ్యాప్తిని నియంత్రించవచ్చు
05-08-2026 08:33 PM
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి,(విజయక్రాంతి): నిరంతర చికిత్స ద్వారా హెచ్‌ఐవీ వ్యాప్తిని నియంత్రించవచ్చని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. బుధవారం ఐడిఓసి కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మొబిలైజేషన్ ఫర్ ఎయిడ్స్ సురక్ష హ్యాండ్‌బుక్‌ను ఆవిష్కరించారు. హెచ్‌ఐవీ నియంత్రణకు సంబంధించి నిర్ధారణ, చికిత్స, వైరల్ లోడ్ నియంత్రణ లక్ష్యాలను సమన్వయంతో సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, డీఎంహెచ్ఓ డా. మధుసూదన్, డా.సందీప్, డా.వెంకట రత్నం, కె.జ్యోతి తదితరులు పాల్గొన్నారు.






