బీజేపీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువు
భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి దేవరం మల్లేశ్వరి
సూర్యాపేట, జూన్ 4 (విజయక్రాంతి): బిజెపి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైందని రోజు రోజుకు మహిళలపై దాడులు జరుగుతున్నాయని భారత జాతీయ మహిళా సమైక్య (ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ) జిల్లా కార్యదర్శి దేవరం మల్లేశ్వరి అన్నారు.
గురువారం జిల్లా కేంద్రంలో ధర్మబిక్షం భవనంలో 72వ భారత జాతీయ మహిళ సమైక్య ఆవిర్భవ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ అమలు పరచడంలో తీవ్ర జాప్యం జరుగుతుందన్నారు.
షీ టీం బృందాలు సంఖ్యను పెంచాలని పాఠశాల, కళాశాల బస్టాండ్, రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలలో ప్రధాన కూడళ్లల్లో మహిళలను, బాలికలను వేధిస్తున్న ఆకతాయిలను గుర్తించి కఠినంగా శిక్షించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వo ప్రతి మహిళకి 2500 ఇస్తామని చెప్పి మోసం చేసిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు ఉప్పునూతల కోటమ్మ, జిల్లా ఆర్గనైజర్ సెక్రెటరీ లక్ష్మి, దంతాల పద్మ రేఖ, నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు దేశ గాని హేమలత, పొదిల వెంకటమ్మ, కోనేటి జయమ్మ, పి అలివేలు తదితరులు పాల్గొన్నారు.






