1 July, 2026 | 1:19 AM

కార్మిక సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికీ అందాలి

01-07-2026 12:22 AM

ఎమ్మెల్యే విజయుడు

ఆలంపూర్, జూన్ 30:  అలంపూర్ నియోజకవర్గంలోని అర్హులైన భవన నిర్మాణ, అసంఘటిత రంగ కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు సకాలంలో అందేలా చర్యలు చేపట్టాలని ఆలంపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే విజయుడు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా లేబర్ అధికారి వేణుగోపాల్ ఎమ్మెల్యే  విజయుడిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, లేబర్ నమోదు ప్రక్రియను వేగవంతం చేసి అర్హులైన కార్మికులకు లేబర్ సర్టిఫికెట్లు ఆలస్యం లేకుండా జారీ చేయాలని సూచించారు.

డెలివరీ బెనిఫిట్, మ్యారేజ్ బెనిఫిట్, విద్యా సహాయం, మరణ పరిహారం వంటి సంక్షేమ పథకాల ప్రయోజనాలు ప్రతి అర్హ కార్మికుడికి అందేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.అదేవిధంగా ప్రభుత్వ పథకాలపై కార్మికులకు విస్తృత అవగాహన కల్పిస్తూ, పారదర్శకంగా, వేగవంతంగా సేవలు అందించాలని సూచించారు.దీనికి స్పందించిన జిల్లా లేబర్ అధికారి వేణుగోపాల్, ఎమ్మెల్యే సూచనల మేరకు ఆలంపూర్ నియోజకవర్గంలో కార్మిక సంక్షేమ పథకాల అమలుకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చి, ప్రతి అర్హ కార్మికుడికి ప్రభుత్వ ప్రయోజనాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు.