రైతులకు కేవీకే ప్రోత్సాహం
- సేంద్రియ వ్యవసాయంపై రైతులకు పూర్తి అవగాహన
- కేంద్ర మంత్రి బండి సంజయ్
- కేవీకేలో ఆహార ప్రాసెసింగ్ ల్యాబ్, రైతు వసతి గృహం ప్రారంభోత్సవం
మెదక్, మార్చి 8 (విజయక్రాంతి): సేంద్రియ వ్య వసాయం వైఫు రైతులను ప్రోత్సహించడంలో కృషి విజ్ఞాన కేంద్రం ప్రథమ స్థానంలో ఉన్నదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఆదివారం మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం కృషి విజ్ఞాన కేంద్రం (తునికి)లో ఆదివారం ఆహార ప్రాసెసింగ్ ల్యాబ్, రైతు వసతి గృహాన్ని ఎంపీ రఘునందన్‌రావు, భారత వ్యవసాయ పరిశోధన మండలి డైరెక్టర్ జనరల్, డేర్ కార్యదర్శి డాక్టర్ మంగీలాల్ జాట్, అఖిల భారతీయ కార్యకారని సదస్య భాగయ్యలతో కలిసి బండి సంజయ్ ప్రారంభించారు.
ఫుడ్ ప్రాసెసిం గ్ ల్యాబ్ లో పరికరాల పనితీరు ల్యాబ్ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. సేంద్రీయ వ్యవసాయం చేస్తున్న వివిధ పంటలను, సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల ఎగ్జిబిషన్లను పరిశీలించారు. అనంతరం మొక్క నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. సేంద్రీయ వ్యవసాయ రంగంలో రైతులను తయారు చేయడం ఏకలవ్య ఫౌండేషన్ ముందు చూపుతో వ్యవహరిస్తుందని అన్నారు. కేవీకేలో రైతులకు వసతిగృహం కట్టడం మంచి ఆలోచన అని.. ఫుడ్ ప్రాసెసింగ్ ల్యాబ్‌ను ఏర్పాటు చేయడం అద్భుతమన్నారు.
200 గ్రామాల ప్రజలు, ఏడుగురు సైంటిస్టులు ఇక్కడ పనిచేయడం మామూలు విషయం కాదన్నారు. మంచి విద్యార్థులను తయారు చేస్తూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం కేవీకే కృషి చేస్తుందన్నారు. డ్రోన్‌ల ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటుందన్నారు. ఈ దేశా సనాతక ధర్మాన్ని కాపాడుకుంటున్నటే మన ఆరోగ్యాన్ని మన వ్యవసాయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. అనేక విషయాల్లో కేంద్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉండే ప్రయత్నం చేస్తుందన్నారు. మెదక్ ఎంపీ రఘునందన్‌రావు మాట్లాడుతూ.. కృషి విజ్ఞాన కేంద్రం ఆర్గానిక్ వైపు పరిగెడుతున్నదని, ప్రజా ప్రయోజనాల కోసం పనిచేసే సంస్థ కెవికె అన్నారు.
రసాయ నాల అవసరం లేకుండా సేంద్రియ వ్యవసాయం వైపు రైతులను మళ్లించే ప్రయత్నం చేస్తుందని, రైతన్నలకు ఎంతో ఉపయోగకరంగా నిలిచినా సంస్థ కేవీకే అని కొనియాడారు. ఇంటి మీద ఉన్న దాబాలలో ఇంటి ముందు ఉన్న పెరటి లో మొక్కలు నా టుకోవాలని ఇండ్లపై సోలార్ ప్లేట్లు పెట్టుకొని విద్యు త్తు ఉపయోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ మంగీలాల్ జాట్ సెక్రెటరీ డిఏఆర్ ఈ, అదనపు కలెక్టర్ నగేష్, డిఏఓ దేవ్ కుమార్ కుమార్, మెదక్, కౌడిపల్లి మండల వ్యవసాయ అధికారి స్వప్న, టాటా కెమికల్స్, ముంబై రాజీవ్ రత్న తదితరులు పాల్గొన్నారు.




