25 February, 2026 | 5:23 PM

హంతకులను శిక్షించేదాకా బాధితులకు అండగా ఉంటా..!

25-02-2026 03:27 PM

కుమ్మెర గట్టు ఘటనపై అసెంబ్లీలో అడుగుతాం.

పసి గుడ్డును చంపినోడు బయట తిరగడానికి వీల్లేదు.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీ రామారావు

నాగర్‌కర్నూల్,(విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర గట్టు(Kummera Gattu incident) మల్లన్న జాతరలో జరిగిన దారుణ ఘటనలో నిందితులకు శిక్ష పడేదాకా  మృతి చెందిన పసిపాప కుటుంబానికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(Kalvakuntla Taraka Rama Rao) స్పష్టం చేశారు. బుధవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, హంతకులను కఠినంగా శిక్షించే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. పసి గుడ్డును చంపినోడు బయట తిరగడానికి వీల్లేదు. రాజకీయాలకు అతీతంగా ఎంతటి వాడైనా ఏపాటి వాడైనా చట్టం ప్రకారం శిక్ష పడాల్సిందేనన్నారు.

బాధితుల పక్షాన ఎవరూ లేరన్న ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) ఈ విషయం పట్ల అహంకార ధోరణి ప్రదర్శిస్తుందన్నారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. కుమ్మెర గట్టు ఘటనపై అసెంబ్లీలో ప్రస్తావించి ప్రభుత్వాన్ని నిలదీస్తామని వెల్లడించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా అన్ని వేదికల్లో పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా ఆవేదన వ్యక్తమవుతుండగా, బాధిత కుటుంబానికి వివిధ వర్గాల నుంచి మద్దతు వెల్లువెత్తుతోంది. పచ్చన సాయంగా లక్ష పార్టీ పరంగా మరో 10 లక్షలు బాధిత కుటుంబానికి అందజేస్తామని ఇల్లు నిర్మాణం కోసం స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సహకరిస్తున్నట్టు పేర్కొన్నారు.