నర్సంపేటలో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం
ఆత్మబలిదానాలు వద్దు..
పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న శంకర్‌గౌడ్
నల్లగొండ బస్టాండ్‌లో మరో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మాహుతియత్నం..
అప్రమత్తమై అడ్డుకున్న తోటి కార్మికులు
మహబూబాబాద్, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): ఆర్టీసీ కార్మికుల సమ్మె గురువారం వరంగల్ జిల్లా నర్సంపేటలో డ్రైవర్ కోలా శంకర్‌గౌడ్ ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకోవడంతో ఉద్రిక్తంగా మా రిం ది. అంతకుముందు డిపో గేటు ఎదుట కార్మికులు ధర్నా చేపట్టారు. ఈ సమయంలో తీవ్ర మనస్తాపానికి గురైన శంకర్‌గౌడ్ తన వెంట బాటిల్‌లో తెచ్చుకున్న పెట్రోలు చల్లుకొని నిప్పంటించుకున్నాడు.
క్షణాల్లో శంకర్ గౌడ్ దేహానికి మంటలు అంటుకోవడంతో కార్మికులు వెంటనే స్పందించి మంటలను ఆర్పీవేసి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆర్టీసీ కార్మికులు.. ప్రభుత్వ వైఖ రిని నిరసిస్తూ పెద్ద ఎత్తున నిరసనకు దిగడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఆత్మహత్యయత్నానికి పా ల్పడ్డ ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
యాజమాన్యం మొండి వైఖరి వల్లే శంకర్ గౌడ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని, ఏదైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని కార్మిక సంఘాల నాయకులు హెచ్చ రించారు. ౮౦శాతం కాలిన గాయలతో ఉన్న శంకర్‌గౌడ్‌ను వెంటనే వరంగల్ ఎంజీయం ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి ఆయనను కంచన్‌బాగ్‌లోని అపోలో ఆస్పుత్రికి తరలించారు. శంకర్‌గౌడ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.






