నర్సింహులపల్లెలో వధువుకు కరీంనగర్ డెయిరీ పుస్తెమట్టెలు
25-02-2026 03:44 PM
తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్నసిరిసిల్లా జిల్లా తంగళ్ళపల్లి మండలం నర్సింహులపల్లె గ్రామంలో పాడిరైతు కొండెటి యాదిరెడ్డి–యాదలక్ష్మి దంపతుల కుమార్తె వెన్నెల వివాహ సందర్భంగా కరీంనగర్ డెయిరీ తరఫున పుస్తెమట్టెలు అందజేశారు. చిన్నలింగాపూర్ రూట్ సూపర్వైజర్ గుర్రం సతీష్ రెడ్డి మాట్లాడుతూ... డెయిరీ సంస్థ ‘కళ్యాణమస్తు’ పథకం ద్వారా ఆడబిడ్డల వివాహాలకు అండగా నిలుస్తోందని తెలిపారు. రైతు కుటుంబాల సంక్షేమమే డెయిరీ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో నర్శింహులపల్లే పాల ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు మంద దేవయ్య, డైరెక్టర్లు కొండెటి రాములు, పల్లె నర్సయ్య, సెక్రటరీ గొడిసెల బాబు తదితరులు పాల్గొన్నారు.




