22 August, 2026 | 2:37 AM

రాష్ట్రంలో నీ ధర్నా ఎప్పుడు రాహుల్?

22-08-2026 01:56 AM
  1. తెలంగాణలోనూ విద్యార్థుల కోసం నీవు పోరాడాలి
  2. ఢిల్లీలో విద్యార్థుల కోసం రాహుల్‌గాంధీ ధర్నా నాటకాలు
  3. విద్యార్థులకు ఢిల్లీలో ఒక నీతి.. తెలంగాణలో ఇంకొక్క నీతా??
  4. రాజ్యాంగ హక్కులు వారికే.. ఇక్కడి వారికి వర్తించవా?
  5. విద్యార్థులపై నిజంగానే ప్రేమ ఉంటే.. జూబ్లీహిల్స్‌లోని రేవంత్‌రెడ్డి ప్యాలస్ ముందు ధర్నా చేయ్
  6. విద్యార్థులపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దాష్టీకంపై కేటీఆర్ ఫైర్

హైదరాబాద్, ఆగస్టు 21 (విజయక్రాంతి): ఢిల్లీలో విద్యార్థుల కోసం ధర్నా చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులపై సాగిస్తున్న దమనకాండకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జూబ్లీహిల్స్ నివాసం ముందు ఎప్పుడు ధర్నా చేస్తారో చెప్పాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమా ండ్ చేశారు.

ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జిని ప్రశ్నిస్తూ బాధిత విద్యార్థులకు అండగా నిలుస్తున్నట్లు నాటకాలు ఆడే రాహుల్ గాంధీ.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభు త్వం విద్యార్థులపై లాఠీలు ఝుళిపించి, వారి ని ఈడ్చుకెళ్లి, గొంతులు నొక్కి చంపేందుకు దాడులకు పాల్పడుతున్న ఘటనలపై ఎందు కు మౌనం వహిస్తున్నారు? అని నిలదీశారు. విద్యార్థులకు ఢిల్లీలో ఒక నీతి.. తెలంగాణలో ఇంకొక్క నీతా? రాజ్యాంగ హక్కులు అక్కడి విద్యార్థులకేనా? ఇక్కడి వారికి వర్తించవా? అని ప్రశ్నించారు.

ఈ మేరకు రాహుల్‌గాం ధీపైన ‘ఎక్స్’లో కేటీఆర్ శుక్రవారం ప్రశ్నల వర్షం కురిపించారు. ఢిల్లీలో విద్యార్థుల కో సం ధర్నా చేస్తున్న రాహుల్ గారూ.. తెలంగాణలో మీ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులపై చేసిన దాష్టీకానికి వ్యతిరేకంగా ఎప్పుడు ధర్నాచేస్తారు? రేవంత్‌రెడ్డి జూబ్లీహిల్స్ నివా సం ముందు ఎప్పుడు కూర్చుంటారు? అని కేటీఆర్ ప్రశ్నించారు. విద్యార్థులపై పోలీసుల దమనకాండ ఢిల్లీలో జరిగినా, తెలంగాణలో జరిగినా ఒకే విధంగా ఖండించాల్సిన బాధ్య త రాహుల్‌పై ఉందన్నారు.

రాజ్యాంగ హక్కులు ఢిల్లీలోని విద్యార్థులకేనా? తెలంగాణ విద్యార్థులకు వర్తించవా? ఇక్కడి విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేస్తున్నా, వారిని ఈడ్చుకెళ్తున్నా, వారి హక్కులను అణచివేస్తున్నా రాహుల్ స్పందించకపోవడం కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమని కేటీఆర్ విమర్శించారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గుర్తు ఉన్నందుకే రాహుల్ గాంధీ మౌనంగా ఉంటున్నారని నిలదీశారు. ఢిల్లీలో విద్యార్థుల మాదిరే తెలంగాణలో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జిని కూడా ఖండించాలని రాహుల్‌గాంధీని డిమాండ్ చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని డిమాండ్ చేయాలని కేటీఆర్ హితువు పలికారు. 

విద్యార్థుల కోసం రాజకీయాలకు అతీతంగా నిలబడు

విద్యార్థుల హక్కుల విషయంలో రాజకీయాలకు అతీతంగా నిలబడతారా? లేక కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దమనకాండకు రాజకీయ రక్షణ కల్పిస్తారా? అని రాహుల్ గాంధీని కేటీఆర్ ప్రశ్నించారు. ఢిల్లీలో విద్యార్థుల కోసం ధర్నా చేసే నైతిక ధైర్యం ఉన్న రాహుల్ గాంధీ.. తెలంగాణలో కాంగ్రెస్ లాఠీలకు గురైన విద్యార్థుల కోసం కూడా అదే పోరాటం చేయాలి.

అంతేకానీ విద్యార్థుల పట్ల ద్వందనీతి సరైనది కాదని, తెలంగాణ విద్యార్థులపై జ రుగుతున్న దాష్టీకంపై స్పందించకుంటే విద్యార్థులపై మీది కపట ప్రేమ మాత్రమే అని ఇక్కడి ప్రజలు భావించాల్సి వస్తుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో విద్యార్థుల హక్కుల కోసం పోరాడుతున్నామని చెప్పే కాంగ్రెస్ నాయకత్వం.. అదే హక్కులు తెలంగాణ విద్యార్థులకు కూడా ఉన్నాయని గుర్తించాలని మండిపడ్డారు.