22 August, 2026 | 2:33 AM

ఎఫ్‌ఐఆర్ నమోదు చేయండి

22-08-2026 02:04 AM
  1. పెల్లెట్ గన్ బాధితులు ఫిర్యాదు ఇస్తే తీసుకోరా?
  2. న్యాయమంటే అమిత్‌షాకు భయమెందుకు?
  3. పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్‌స్టేషన్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ధర్నా
  4. పెల్లెట్ గాయాలైన సాహిల్‌తో కలిసి నేరుగా స్టేషన్‌కు..
  5. ధర్నాలో పాల్గొన్న ప్రియాంకగాంధీ, కాంగ్రెస్ శ్రేణులు
  6. ఎట్టకేలకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు

న్యూఢిల్లీ, ఆగస్టు 21: సీజేపీ (కాక్రోచ్ జన తా పార్టీ) ఆధ్వర్యంలో జూలై 20న జరిగిన నిరసనలో పెల్లెట్ గాయాలకు గురైన యువకుడి ఫిర్యాదుపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయా లని శుక్రవారం పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్‌స్టేషన్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ మెరు పు ధర్నాకు దిగారు. అప్పటి వరకు తాను ఇక్కడి నుంచి కదలబోనని పట్టుపట్టారు. బాధితులు ఫిర్యాదు చేస్తే తీసుకోరా? ఎందు కు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయరు? న్యాయమంటే అమిత్‌షాకు భయమెందుకు? అని ఢిల్లీ పోలీసులను నిలదీశారు.

పెల్లెట్ గా యాలైన సాహిల్, అతని తల్లితో కలిసి నేరు గా పోలీస్ స్టేషన్‌కు ఆయన వచ్చారు. ‘పై సా ్థయి నుంచి ఆదేశాలు ఉన్నందున’ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేమని పోలీసు అధికారులు తనకు చెప్పారని ఆరోపించారు. హుల్ గాం ధీ మొదట లోచబ్‌తో కలిసి మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఎఫ్‌ఐఆర్ నమోదు చే యాలని కోరారు. కానీ పోలీసులు సస్సేమి రా అనడంతో పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (న్యూఢిల్లీ జిల్లా) సచిన్ శర్మను కలిశారు.

సచిన్‌శర్మతో జరిపిన చర్చలు ఫలితాన్ని ఇవ్వకపోవడంతో, రాహుల్‌గాంధీ పోలీస్ స్టేషన్ (ఇక్కడే డీసీపీ కార్యాలయం కూడా ఉంది) వద్ద ధర్నాకు దిగారు. ఈ ధర్నాలో లోచబ్, అతని తల్లితోపాటు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ, అధిర్ రంజన్ చౌదరి, స ల్మాన్ ఖుర్షీద్, జైరామ్ రమేష్, కాంగ్రెస్ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున అక్కడే బైఠాయించి ధర్నాకు దిగారు. అనేక నాటకీయ పరిణామాల తర్వాత చివరకు పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

ఈ సందర్భంగా మీడియాతో రాహుల్‌గాంధీ మాట్లాడుతూ.. ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని మాత్రమే తాము కోరుతున్నాం. సాహిల్ ఇక్కడే ఉన్నా డు, అతని తల్లి కూడా అతనితో ఉంది. పైస్థా యి నుంచి ఆదేశాలు ఉన్నందున ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేమని పోలీసు అధికారులు చెబుతున్నారు. కానీ ఎఫ్‌ఐఆర్ నమోదు అయ్యే వరకు, తాము ఇక్కడి నుంచి కదలబోము’ అని స్పష్టం చేశారు. ‘మా ఏకైక డి మాండ్ ఎఫ్‌ఐఆర్ నమోదు, దర్యాప్తు అధికారి పేరు తెలియజేయడం మాత్రమే.

మే ము ఈ కుటుంబానికి న్యాయం మాత్రమే కోరుతున్నాం’ అని అన్నారు. ఒక యువకుడిపై కాల్పులు జరపవచ్చని, కానీ ‘అమిత్ షా ఆధ్వర్యంలోని ఢిల్లీ పోలీసులు బాధితుడికి న్యాయం చేయడం లేదని’ ఆరోపించా రు. ‘లోచబ్ కంటిలో మూడు పెల్లెట్లు కనిపించాయి. ఆసుపత్రి నివేదికలో ఈ విష యం స్పష్టంగా ఉంది. తాము పెల్లెట్ గన్‌ల ను ఉపయోగించలేదని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. కానీ ఇంకెవరు ప్రయోగించారు?’ అని నిలదీశారు.

ఆగస్టు 13 నుంచి లోచబ్ తల్లిని ఒక పోలీస్ స్టేషన్ నుంచి మ రొక స్టేషన్‌కు తిప్పుతున్నారు, కానీ ఇప్పటివరకు ఎటువంటి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయ లేదని తెలిపారు. మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ ఒక చిన్న ప్లాస్టిక్ బాక్స్‌లో ఉన్న పెల్లెట్లను చూపుతూ.. “ఇవి ఆ బాధితుడి శరీరం నుంచి తీసిన పెల్లెట్లు. అతడి కంటిలో మూడు, శరీరంలో 200కి పైగా దూసుకెళ్లాయి” అని అన్నారు.

ఎయిమ్స్, లేడీ హార్డింజ్ ఆసుపత్రి మెడికల్ రిపోర్టులను ఆధారంగా ఆయన చూపించారు. వి ద్యార్థుల నిరసన సమయంలో పెల్లెట్ గన్‌ల తో కాల్పుల ఆరోపణలపై పరిశీలనకు సు ప్రీంకోర్టు ఒక ఉన్నతాధికార నిపుణుల కమిటీని ఏర్పాటు చేసినట్టు ఈ సందర్భంగా ఢిల్లీ పోలీసులు తెలిపారు. అయితే, ఎఫ్‌ఐఆర్ నమోదు అయ్యే వరకు కదలేది లేదని రా హుల్‌గాంధీ స్పష్టం చేశారు. 

అరాచకం.. తీవ్రమైన నేరం

శాంతియుత నిరసనపై జరిగిన ‘అరాచకం’ ఒక ‘తీవ్రమైన నేరం’ అని ‘ఎక్స్’లో రాహుల్ గాంధీ పోస్ట్ చేశారు. ‘సాహిల్‌పై జూలై 20న పోలీసులు పెల్లెట్ గన్‌తో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సాహిల్ ఒక కంటి చూపును కోల్పోయే ప్ర మాదం ఉంది’ అని అన్నారు. ఈ క్రూరత్వం పై హోంమంత్రి అమిత్‌షా విద్యార్థులకు ఎ టువంటి వివరణ ఇవ్వలేదు. అలాగే ప్రధా న మంత్రి కూడా వారికి క్షమాపణ చెప్పలే దు’ అని మండిపడ్డారు.

న్యాయం కోసం సాహిల్ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలనుకు న్నా, దానికి కూడా అనుమతించడం లేద ని గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధం గా రాజ్యాంగం, రాజ్యాంగపరమైన హక్కు లు కాలరాయబడుతున్నాయి. ‘అమిత్‌షా జీ, న్యాయం అంటే మీకు ఎందుకంత భ యం? ఈ భయం మీరు మీ నేరాన్ని అంగీకరిస్తున్నారా?’ అని నిలదీశారు. లోచబ్‌కు, అతని లా బాధితులైన ప్రతి విద్యార్థికీ న్యా యం జరిగే వరకూ తాము అండగా ఉం టాం’ అ ని రాహుల్‌గాంధీ స్పష్టం చేశారు. 

ఎఫ్‌ఐఆర్ నమోదు..!

అయితే రాహుల్ గాంధీ ధర్నాతో ఢిల్లీ పోలీసులు దిగొచ్చారు. పెల్లెట్‌గన్ అంశంపై కేసు నమోదు చేసేందుకు తొలుత ససేమిరా అన్నా, కాంగ్రెస్ అగ్రనేతల భారీ ధర్నాతో పోలీసులు ఎట్టకేలకు బాధితుడి నుంచి ఫిర్యాదును స్వీకరించి, ఎఫ్‌ఐఆర్ నమోద చేశారు. దీంతో రాహుల్‌గాంధీ ఆరు గంటలకు పైగా సాగిన తన ధర్నాను విరమిం చారు.

ఇది న్యాయం దిశగా మొదటి అడుగు అని పేర్కొన్నారు. న్యాయం కోసం ప్రయత్నించేటప్పుడు దేశప్రజలు ఎలాంటి ఇబ్బం దులు పడతారో దీనిని బట్టి ఊహించవచ్చు అని తెలి పారు. హోంశాఖలోని ఉన్నతాధికారుల అనుమతి లభించిన తర్వాతే ఎఫ్‌ఐఆర్ నమోదైందని రాహుల్ పేర్కొన్నారు.