తెలంగాణతో జతకట్టండి
- ప్రపంచస్థాయి విద్యకు సహకరించండి
- యూకే పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి
- ‘ఆక్స్‌ఫర్డ్’ విద్యావేత్తలతో భేటీ
- తెలంగాణకు రావాలని ఆహ్వానం
హైదరాబాద్, ఆగస్టు 21 (విజయక్రాంతి): తెలంగాణలో విద్యా కార్యక్రమాలను విస్తరించాలని, ప్రపంచస్థాయి విద్య, పరిశోధన అవకాశా ల్లో భాగస్వాములు కావాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆక్స్‌ఫర్ యూనివర్సిటీ విద్యావేత్తలను కోరారు. యూకే పర్యటనలో భాగంగా శుక్రవారం తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందంతో కలిసి ప్రపం చ ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీని సందర్శించారు.
యూనివర్సిటీ పరిధిలోని బ్లావాట్నిక్ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్‌కు చెందిన ప్రొఫెసర్ మాయా ట్యూడర్, బేలియోల్ కాలేజీ ప్రొఫెసర్ ఫైసల్ దేవ్జీతో సీఎం భేటీ అయ్యారు. ‘తెలంగాణ రైజింగ్’ విజన్‌ను వారికి వివరించారు. హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి విద్యా కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం రూపొందిస్తున్న చేపడుతున్న చర్యలను వారికి వివరించారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కా ర్యక్రమాలు, పరిశోధన సామర్థ్యాలు, విస్తృతమైన విద్యా వ్యవస్థను హైదరాబాద్‌కు విస్తరిం చాలని కోరారు.
హైదరాబాద్‌లో కేంద్రం ఏర్పా టు చేసి, తెలంగాణ యువతకు, ఉద్యోగ నిపుణులకు ప్రపంచస్థాయి విద్యా, పరిశోధన అవకాశాలు అందించాలని స్పష్టం చేశారు. కేంద్ర ప్ర భుత్వ జాతీయ విద్యా విధానం కింద విదేశీ విశ్వవిద్యాలయాలకు అందుబాటులో ఉన్న అవ కాశాలపై ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఆక్స్‌పర్డ్ యూనివర్సిటీ విద్యావేత్తలు సానుకూలంగా స్పందించారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్‌కు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రతినిధులను తెలంగా ణ బృందం ఆహ్వానించింది.
సోమర్విల్ కాలేజీ సందర్శన
చారిత్రక సోమర్విల్ కాలేజీని సీఎం రేవంత్‌రెడ్డి సందర్శించారు. ఈ కాలేజీలో విద్యాభ్యాసం చేసిన దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ చిత్రపటాన్ని పరిశీలించారు. ఈ చిత్రపటాన్ని 2002లో సోనియాగాంధీ బహూకరించారు. అ నంతరం అక్కడే జీఎంఆర్ గ్రూప్ నిర్వహిస్తున్న యుటిలిటా బౌల్‌ను సందర్శించారు. జీఎంఆర్ గ్రూప్ కార్పొరేట్ చైర్మన్ కిరణ్ కుమార్ గ్రంథి తో కలిసి క్రీడా సదుపాయాలను పరిశీలించారు.
గ్లోబల్ స్పోర్ట్స్ యూనిట్‌తో భేటీ అయ్యారు. ప్రపంచస్థాయి క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. పర్యటనలో ప్రీమియర్ లీగ్ చాంపియన్స్ ఆర్సెనల్, కోవెంట్రీ ఈపీఎల్ మ్యాచ్‌ను వీక్షించేందు కు ఎమిరేట్స్ స్టేడియానికి వెళ్లనున్నారు.






