22 August, 2026 | 3:11 AM

రైస్ మిల్లర్లలో వణుకు

22-08-2026 02:20 AM

మంత్రుల వద్దకు పరుగులు

ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో ఐదుగురిపై పీడీయాక్ట్‌కు సిద్ధం

ఈడీకి అందిన సివిల్ సప్లయ్ శాఖ నివేదిక

కరీంనగర్, ఆగస్టు 21 (విజయక్రాంతి): సీఎ ంఆర్ ఎగవేతదారుల్లో వణుకు మొదలయింది. కేసుల నుంచి బయటపడేయలంటూ మంత్రు ల వద్దకు పరుగులు తీస్తున్నారు. ప్రభుత్వ ధాన్యం బకాయిలను భారీగా ఎగవేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రైస్ మిల్లర్లపై సివిల్ సప్లయ్ శాఖ చర్యలకు సిద్ధమవడంతో రైస్ మిల్లర్ల యాజమానుల్లో వణుకు మొదలైంది.

దీంతో తమపై తీసుకోనున్న చర్యలను నిలుపుదల చేయాలంటూ పలువురు మిల్లర్ల యాజమానులు మంత్రుల వద్దకు పరుగులు తీస్తూ మొరపెట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వానికి భారీ మొత్తంలో బకాయిపడిన ఉమ్మడి జిల్లాలో ఐదు రైస్ మిల్లర్ల జాబితాను సివిల్ సప్లయ్ శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి అందజేసినట్లు సమాచారం.

మిల్లర్లు ఉద్దేశపూర్వకంగా ధాన్యం బకాయిలను నిలిపివేసినట్లు అధికారులు గుర్తించారు. ధాన్యం లావాదేవీల్లో అక్రమ మార్గాల్లో నిధులు సమీకరించడం, హవాలా రూపంలో డబ్బులు సంపాది ంచడం వంటి ఆరోపణలు కూడా మిల్లర్లపై వెల్లువెత్తాయి. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే ఒకరిపై పీడీ యాక్ట్ నమోదు కాగా, ఉమ్మడి జిల్లాల్లో ఐదు మిల్లులు రూ.30 కోట్లకు పైన డిఫాల్ట్ లిస్ట్‌లో ఉండటంతో వీరిపైన పీడీయాక్ట్‌కు సిద్ధం అవుతున్నట్లు సమాచారం.

ఎగవేతదారుల నివేదికలను పౌర సరఫరాల సంస్థ నివేదికలు, పోలీసుల తనిఖీల్లో వెల్లడైన వివరాల ప్రకారం శ్రీ సీతారామ ఆగ్రో ఇండస్ట్రీస్ (శ్రీరాములపల్లి, ఇల్లందకుంట మండ లం) సుమారు రూ. 69 కోట్లు, మహాశక్తి ఇండస్ట్రీస్ (కోరపల్లి, జమ్మికుంట పరిధి) సుమారు రూ. 62 కోట్లు, సాయి మహాలక్ష్మీ ఇండస్ట్రీస్ (సుల్తానాబాద్) సుమారు రూ. 20 కోట్లు బకాయి, సౌభాగ్య ఇండస్ట్రీస్ (పూసాల గ్రామ పరిధి) రూ. 7 కోట్లు బియ్యాన్ని అమ్ముకున్నట్లు ఇప్పటికే కేసులు నమోదయ్యాయి.

బకాయిలు చెల్లించకుండా జాప్యం చేస్తున్నవారి భరతం పట్టేందుకు, వారిపై పీడీయాక్ట్ ప్రయోగించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కట్నపల్లికి చెందిన రైస్ మిల్లర్ బం డారి మారుతిపై ప్రభుత్వ కస్టమ్ మిల్లింగ్ రైస్ ధాన్యం అక్రమ తరలింపులో రామగుండం పోలీసులు పీడీ యాక్డ్ నమోదు చేశారు.