పెండింగ్ భూసేకరణ, పునరావాసం వేగవంతం చేయాలి
22-08-2026 01:55 AM
మహబూబ్‌నగర్ టౌన్ , ఆగస్టు 21: నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ భూసేకరణ, నిర్వాసితులకు పరిహారం, పునరావాస ప్రక్రియలను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు. శుక్రవారం మంత్రి ఎన్. ఉత్తమ్కుమార్రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం అధికారులతో సమీక్షించి, భూసేకరణ సమస్యలను రైతులతో మాట్లాడి క్షేత్రస్థాయిలో పరిష్కరించాలని సూచించారు. ప్రాజెక్టుల పనులకు ఆటంకం లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.






