ఇందు కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా
22-08-2026 01:57 AM
ఎర్రవల్లి, ఆగస్టు 21: ఎర్రవల్లి గ్రామానికి చెందిన నీట్ విద్యార్థిని ఉప్పరి ఇందు కుటుంబానికి ప్రభుత్వం మంజూరు చేసిన రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా చెక్కును శుక్రవారం అందజేశారు. గద్వాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రెండు నెలల క్రితం ఇందు మృతి చెందిన విషయం తెలిసిందే.
జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా మంజూరు చేసిన చెక్కును గ్రామ సర్పంచ్ అనిత కృష్ణసాగర్ ఇందు కుటుంబ సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు కలెక్టర్కు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామస్థులు భవిష్యత్తులోనూ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.






