రేవంత్ సర్కార్ రైతు డిస్కమ్ పెట్టిందే ప్రైవేటీకరణ కోసం
సీఎం రేవంత్ రెడ్డి 71 సార్లు ఢిల్లీకి వెళ్లి.. రూ. 71 కూడా తేలేదు
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ను శిథిలం చేసి పాతిపెట్టి పోతారు.
హైదరాబాద్: రేవంత్ ప్రభుత్వం రైతు డిస్కమ్(Rythu DISCOM) పెట్టిందే ప్రైవేటీకరణ కోసమని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. రైతుల మోటార్లకు మీటర్లు పెట్టడం కోసమే రైతు డిస్కమ్ అన్నారు. సీఎం రూ. 200 కోట్లతో ఇంకో క్యాంపు ఆఫీసు నిర్మించుకున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి రాజసౌధాన్ని ఎందుకు దాస్తున్నారు? రహస్యం ఎందుకు?, రేవంత్ రెడ్డికి రాజసౌధాలు, భట్టి విక్రమార్కకు 3 క్యాంపు ఆఫీసులు ఎందుకు?, సీఎం రేవంత్ కు కొత్త హెలికాప్టర్లు, ఫుట్ బాల్ గ్రౌండ్ ఎందుకు? అని కేటీఆర్ ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి71 సార్లు ఢిల్లీకి వెళ్లి రూ. 71 కూడా తేలేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ను శిథిలం చేసిన.. పాతిపెట్టి పోతారని కేటీఆర్ జోస్యం చెప్పారు.






