24 July, 2026 | 5:48 PM

సుల్తానాబాద్‌లో కేటీఆర్ జన్మదిన వేడుకలు

24-07-2026 04:56 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): మాజీ ఐటి,మున్సిపల్ శాఖ మంత్రి, బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను శుక్రవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని నెహ్రు విగ్రహం ఎదుట ఆ పార్టీ నాయకులు బాణాసంచ పేల్చి, కేక్ కట్ చేసి స్వీట్లు పంచి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎంపిటిసి సురశ్యామ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు పారుపల్లి గుణపతి,  సర్పంచ్ ఉత్తమ కుమారి, తాళ్లపల్లి మనోజ్ గౌడ్, సురశ్యామ్, క్యాదాసి చంద్రమౌళి, మల్లికార్జున్, మోహన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మొలుగూరి అంజయ్య, లంక దాసరి రవీందర్, తిప్పారపు దయాకర్, కూకట్లగోపి, ఎండి సాజిద్, కుమార్ బాబు, శీలం శంకర్, పోసాని శ్రీనివాస్, వేయికళ్ల నరేందర్, కంపల్లి రాజు, కనకం శంకర్, పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.