24 July, 2026 | 6:19 PM

ఢిల్లీ ఆందోళనల్లో అరాచకశక్తులు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

24-07-2026 05:28 PM

మోదీని దించాలి.. రాహుల్ ను ప్రధాని చేయాలనేదే కాంగ్రెస్ ఆలోచన

నీట్ కు శ్రీరాముడికి సంబంధం ఏంటి?

హైదరాబాద్: విద్యార్థులకు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్(Union Minister Dharmendra Pradhan) క్షమాపణ చెప్పారని కేంద్రమంత్రి బండి సంజయ్(Union Minister Bandi Sanjay) హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరించారు. విద్యార్థులకు, తల్లిదండ్రులకు ప్రధాని నరేంద్ర మోదీ భరోసా ఇచ్చారని వెల్లడించారు. నీట్ పేపర్ లీక్ అవ్వగానే వేగంగా చర్యలు తీసుకున్నామని తెలిపారు. నీట్ పేపర్ లీక్(NEET paper leak) చేసిన 17 మందిని అరెస్టు చేశామని సూచించారు. ఇన్ని రోజులు ఆందోళన ఎక్కడ లేదని తెలిపారు. విద్యార్థుల దీక్షకు ప్రభుత్వమే అనుమతి ఇచ్చిందని వెల్లడించారు. విద్యార్థుల ముసుగులో అసాంఘిక శక్తులు చొరబడ్డారని బండి సంజయ్(Bandi Sanjay) ఆరోపించారు. మహిళా జర్నలిస్టు పట్ల కూడా అసభ్యకరంగా ప్రవర్తించారని, 118 మంది పోలీసులకు గాయాలయ్యాయని చెప్పారు. పోలీసులు సమన్వయంతో వ్యవహరించారని సూచించారు. పోలీసులు ఫైరింగ్ కూడా చేయలేదు, కేవలం లాఠీచార్జ్ చేశారని తెలిపారు.

దెబ్బలు తిన్నవారిలో చాలా మంది విద్యార్థులు కాదన్నారు. నీట్ కు ఆర్టికల్ 370(Article 370), ఆజాదీ కాశ్మీర్ కు సంబంధం ఏంటీ? అని ప్రశ్నించారు. నీట్ కు శ్రీరాముడికి సంబంధం ఏంటి అన్నారు. విద్యార్థుల చేతుల్లో రాళ్లు, కర్రలు, ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చాయని బండి సంజయ్ ప్రశ్నించారు. విద్యార్థులైతే రాళ్లు, కర్రలు, ఆయుధాలు పట్టుకోరని ఆయన వివరించారు. నీట్ పై పార్లమెంట్ లో చర్చకు ప్రభుత్వం అంగీకరించిందని బండి సంజయ్ తెలిపారు. మోదీని దించాలి.. రాహుల్ ను ప్రధాని చేయాలనే కాంగ్రెస్ ఆలోచనని బండి సంజయ్ సూచించారు. యూపీఏ హయాంలో 78 సార్లు పేపర్ లీక్ అయింది.. ఆరోజు ప్రధాని మన్మోహన్ సింగ్ రాజీనామా చేయలేదని ఆరోపించారు. రాజస్థాన్ లో కాంగ్రెస్ హయాంలో 28 సార్లు పరీక్ష పెడితే 18 సార్లు లీక్ అయిందన్నారు. ఢిల్లీలో ఆందోళన జరిగిన తర్వాత రోజు పాకిస్థాన్ కు చెందిన 40 సోషల్ మీడియా ఖాతాలను పోలీసులు నిలిపి వేశారని కేంద్రమంత్రి వెల్లడించారు.