ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలి
24-07-2026 05:36 PM
కొమురవెల్లి,(విజయక్రాంతి): రాబోయే రోజుల్లో బోరు చెరువుల ద్వారా నీటి లభ్యత మరింత తగ్గే అవకాశం ఉన్నందున నీటిని ఆదా చేస్తూ, ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసి నష్టాలను తగ్గించుకోవాలని మండల వ్యవసాయ అధికారి కుందూరు వెంకట రావమ్మ పేర్కొన్నారు. స్థానిక రైతు వేదికలో ఆమె మాట్లాడుతూ మొత్తం విస్తీర్ణంలో వరి సాగు చేయకుండా, కొంత భాగంలో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని సూచించారు. తక్కువ నీటితో సాగు చేసే పంటలైన జొన్న, పెసర్లు, కంది, పొద్దు తిరుగుడు లాంటి పంటలు సాగు చేసుకోవాలని తెలిపారు. ఎలినోన్ ప్రభావం వలన వర్షాలు సక్రమంగా కురియక భూగర్భ జలాలు, బోరు బావులలో నీటి మట్టాలు తగ్గిపోతున్నాయని తెలిపారు.






