జిల్లాలో విద్యాసంస్థల బంద్ విజయవంతం
24-07-2026 05:30 PM
నిర్మల్,(విజయక్రాంతి): నీట్ పరీక్ష లీకేజీ కారణమైన కేంద్ర మంత్రిని తప్పించి ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాలని కోరుతూ విద్యార్థి సంఘాలు, వామపక్షాల ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్ శుక్రవారం విజయవంతమైంది. జిల్లా కేంద్రంతో పాటు బైంసా ఖానాపూర్ పట్టణాల్లో విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిరసన తెలిపి విద్యాసంస్థల బంద్ విజయవంతం చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు వెంకటేష్ దిగంబర్ మహేందర్ పరమేశ్వర్ తదితరులు ఉన్నారు.






