బస్తీ దవాఖానను తనిఖీ చేసిన జిల్లా అధికారి
24-07-2026 04:56 PM
నిర్మల్ జులై 24 ( విజయ క్రాంతి): నిర్మల్ జిల్లాలో ప్రజలకు సీజనల్ వ్యాధులు రాకుండా వైద్యులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజేందర్ అన్నారు. శుక్రవారం నిర్మల్ జిల్లాలోని బస్తీ దౌఖానాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు పొందుతున్న సేవలు మందుల కొరత సిబ్బంది పనితీరు అడిగి తెలుసుకున్నారు. సమయపాలన పాటించాలని సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది రవీందర్ వైద్యులు ఉన్నారు.






