16 April, 2026 | 12:23 PM

జై కిసాన్ రైతు సంక్షేమ సంఘం అధ్యక్షులుగా కొత్త మహేష్

16-04-2026 10:43 AM

కొత్తపల్లి, ఏప్రిల్ 16(విజయక్రాంతి): కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని 16వ డివిజన్ మల్కాపూర్ లో జై కిసాన్ రైతు సంక్షేమ సంఘం కు బుధవారము జరిగిన ఎన్నికల్లో మాజీ అధ్యక్షులుగా పనిచేసిన గుంటపల్లి రవికుమార్ పై మాజీ ప్రధాన కార్యదర్శి కొత్త మహేష్ గెలుపొందారు. ప్రధాన కార్యదర్శిగా పల్లె సంతోష్ కుమార్, కోశాధికారిగా గంగాధర నరేష్  ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల్లో ఓట్లు వేసి గెలిపించిన సభ్యులకు నూతన అధ్యక్షుడు కొత్త మహేష్ కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల అధికారిగా నరహరి లక్ష్మారెడ్డి , పర్యవేక్షకులుగా కార్పొరేటర్ కాంతాల జగన్ రెడ్డి  ,మాజీ సర్పంచ్ కాసారపు శ్రీనివాస్  వ్యవహరించినారు.