11 July, 2026 | 1:43 AM

కొరియన్ కనకరాజు వచ్చేస్తున్నాడమ్మీ!

11-07-2026 12:00 AM

వరుణ్‌తేజ్ హీరోగా దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్న హారర్-కామెడీ ‘కొరియన్ కనకరాజు’. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రితికా నాయక్ కథానాయికగా నటిస్తుండగా, కమెడియన్ సత్య కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ చివరి దశలో ఉన్న ఈ మూవీ తాజా గా రిలీజ్ డేట్‌ను ఖరారు చేసుకుంది.

ఆగస్టు 7న ప్రపంచవ్యాప్త థియేటర్ల ద్వారా విడుదల చేస్తున్నట్టు చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ‘కనక రాజు వచ్చేస్తున్నాడమ్మీ’ అంటూ టీమ్ పంచుకున్న రిలీజ్ డేట్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఇందులో కొరియన్ గ్యాంగ్‌స్టర్ల గ్యాంగ్ చుట్టుముట్టి ఉన్నా, ఏమాత్రం బెదరకుండా వరుణ్‌తేజ్ కుర్చీలో హుం దాగా కూర్చుని కనిపిస్తున్నా రు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్ థమన్; డీవోపీ: మనో జ్ రెడ్డి కటసాని; నిర్మాతలు: రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి; రచన, దర్శకత్వం: మేర్లపాక గాంధీ.