ఘనంగా కొండ మైసమ్మ జాతర
కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండల కేంద్రంలో గ్రామ దేవత అయిన కొండ మైసమ్మ జాతర సోమవారం ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఆనవాయితీగా జరిగే ఈ జాతరను గ్రామస్తులు సమిష్టిగా నిర్వహించడం విశేషం.
పంటలు బాగా పండాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలకు ఎలాంటి నష్టం కలగకూడదని కోరుతూ గ్రామస్తులు కొండ మైసమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూర్వికుల ఆచారాలను కొనసాగిస్తూ భక్తి శ్రద్ధలతో జాతరను జరుపుకున్నారు. కొండ మైసమ్మ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించగా, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పాడి పంటలు, వర్షాలు సమృద్ధిగా ఉండాలని దేవతను వేడుకున్నారు.ఈ జాతరకు ముఖ్య అతిథులుగా తాసిల్దార్ వరలక్ష్మి, ఎస్సై ప్రశాంత్ రెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు మిరియాల కర్ బాలాజీ, సర్పంచ్ కాశీరాం, ఉప సర్పంచ్ రేవతి, గ్రామ పాలకవర్గ సభ్యులు, కొండ మైసమ్మ కమిటీ సభ్యులు,గ్రామస్తులుతదితరులు పాల్గొన్నారు.




