8 May, 2026 | 4:08 PM

Breaking News

టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్.. విజయ్‌కు వామపక్షాల మద్దతు   •   అనారోగ్యం బారిన పడిన విలేఖరి కుటుంబానికి సీఎం సహాయ నిధి అందజేత   •   పశువుల ఆరోగ్యం పట్ల అశ్రద్ధ పనికిరాదు   •   స్వీయ జనగణనపై అవగాహన   •   ఉపాధి హామీ పనుల్లో కార్మికుల సంఖ్య పెంచాలి   •   జనాభా గణనలో పాల్గొనడం ప్రతి ఒక్కరి బాధ్యత   •   ఇంటర్మీడియట్ సప్లమెంటరీ అడ్వాన్స్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి..   •   ఇబ్రహీంపేట్ లో అంబలి కేంద్రం, చలివేంద్రం ప్రారంభం   •   మొండికుంట రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన రేగా కాంతారావు   •   పశువులలో ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం ప్రారంభం   •  

మాల్ లో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ ఆవిష్కరణ

20-02-2026 02:05 PM

దేవరకొండ,(విజయక్రాంతి): చింతపల్లి మండలంలోని మాల్ గ్రామంలో ఏర్పాటు చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ(Konda Laxman Bapuji statue) విగ్రహావిష్కరణ కార్యక్రమంలో దేవకొండ  శాసన సభ్యులు నేనవత్ బాలు నాయక్ నల్గొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పున్నా కైలాష్ నేత లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమానికి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అందించిన ప్రజాస్వామిక స్ఫూర్తి, చేసిన త్యాగం మరువలేనిదని తెలిపారు.స్వాతంత్ర్య సమర యోధుడు, తెలంగాణ తొలి తరం ఉద్యమకారుడు, గాంధేయవాది, ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారుఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, జిల్లా నాయకులు,మండల ముఖ్య నాయకులు, పద్మశాలి సంఘం నాయకులు , యువజన కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.