22 July, 2026 | 3:44 PM

Breaking News

ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డి పిటిషన్ వాయిదా   •   రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ ఇల్లందులో రాస్తారోకో..   •   విద్యార్థుల స్కాలర్‌షిప్‌ కొరకు దరఖాస్తుల ఆహ్వానం.!   •   నాచారం ఎస్ఐ ఫ్రాన్సిస్‌కు సీపీ రివార్డ్   •   బోయినపల్లి వినోద్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా   •   కాక్రోచ్ పార్టీ ఆందోళన ఎఫెక్ట్.. 16 ఢిల్లీ మెట్రో స్టేషన్లు మూసివేత   •   శాంతినగర్‌లో 'వజ్రం ప్యూర్ ఫైర్' శుద్ధ జల కేంద్రం ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజర్షిషా..   •   కొమురవెల్లిలో దాశరథి జయంతి ఉత్సవాలు   •   గిరిజన ఆశ్రమ పాఠశాలలకు గ్యాస్ కొరత   •   సోనాల ఆసుపత్రి డాక్టర్ డిప్యూటేషన్ రద్దు చేయండి   •  

భూ వివాదం నేపథ్యంలో సర్పంచ్ భర్తపై దాడి

22-07-2026 02:36 PM

నిందితులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల డిమాండ్

మల్దకల్, జూలై 22: గద్వాల జిల్లా(Gadwal District) మల్దకల్ మండలంలోని పవనంపల్లి గ్రామంలో భూ వివాదం నేపథ్యంలో బుధవారం గ్రామ సర్పంచ్ రాజేశ్వరి భర్త రామాంజనేయులుపై దాడి జరిగినట్లు గ్రామస్తులు ఆరోపించారు. గ్రామస్తుల కథనం ప్రకారం, భూ సమస్యపై మాట్లాడాలని చెప్పి రామాంజనేయులను పొలం వద్దకు పిలిపించగా, అక్కడికి 20 మందికి పైగా వ్యక్తులు చేరుకుని ఎలాంటి చర్చ లేకుండానే దాడికి పాల్పడ్డారని తెలిపారు. ప్రాణభయంతో రామాంజనేయులు అక్కడి నుంచి పరుగు తీయగా, వెంబడించి మరీ దాడి చేసినట్లు పేర్కొన్నారు.

ఈ ఘటనకు ముందు మల్దకల్ ఎస్‌ఐ శ్రీహరిని సంప్రదించగా, పొలం వద్దకు వెళ్లాలని సూచించారని గ్రామస్తులు తెలిపారు. అనంతరం జరిగిన దాడిలో కొందరి ప్రమేయంతో పాటు పోలీసు అధికారిపై కూడా తమకు అనుమానాలు ఉన్నాయని ఆరోపించారు. దాడికి పాల్పడిన వారిపై, అలాగే ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు జిల్లా ఎస్పీని కోరారు. ఒక గ్రామ సర్పంచ్ కుటుంబానికే ఈ పరిస్థితి ఎదురైతే సాధారణ ప్రజల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోందని వారు పేర్కొన్నారు. అలాగే, ఈ ఘటనపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి న్యాయం చేయాలని, లేని పక్షంలో ప్రభుత్వ దృష్టికి విషయం తీసుకెళ్లి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని గ్రామస్తులు హెచ్చరించారు.