22 July, 2026 | 3:44 PM

Breaking News

ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డి పిటిషన్ వాయిదా   •   రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ ఇల్లందులో రాస్తారోకో..   •   విద్యార్థుల స్కాలర్‌షిప్‌ కొరకు దరఖాస్తుల ఆహ్వానం.!   •   నాచారం ఎస్ఐ ఫ్రాన్సిస్‌కు సీపీ రివార్డ్   •   బోయినపల్లి వినోద్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా   •   కాక్రోచ్ పార్టీ ఆందోళన ఎఫెక్ట్.. 16 ఢిల్లీ మెట్రో స్టేషన్లు మూసివేత   •   శాంతినగర్‌లో 'వజ్రం ప్యూర్ ఫైర్' శుద్ధ జల కేంద్రం ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజర్షిషా..   •   కొమురవెల్లిలో దాశరథి జయంతి ఉత్సవాలు   •   గిరిజన ఆశ్రమ పాఠశాలలకు గ్యాస్ కొరత   •   సోనాల ఆసుపత్రి డాక్టర్ డిప్యూటేషన్ రద్దు చేయండి   •  

వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు

22-07-2026 02:43 PM

బోథ్,(విజయక్రాంతి): సూపర్ ఎలి నినోతో రైతంగం విలవిలలాడుతుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోకుండా రైతుల్లో ఆందోళన నెలపొందని రైతుబంధు మాజీ అధ్యక్షులు నల్ల జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. ముందు ఉన్న ముప్పును వాతావరణ శాఖ వారు హెచ్చరికలు జారీ చేసిన ప్రభుత్వ పరంగా రైతులకు ఎలాంటి సూచనలు ఇవ్వకుండా చేస్తున్నారని ఆయన విమర్శించారు. రైతన్నకు అవసరమైన సలహాలు సూచనలు ఇవ్వడంలో విప్పలమయ్యారని ఆయన పేర్కొన్నారు.

కరువు కోరల్లో  చిక్కుకున్న రైతన్నను ఆదుకోవడం కోసం ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కలిగించాల్సి ఉందన్నారు మరోవైపు పంటల బీమా పథకాన్ని ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు కేంద్రం నివేదికలు 670 జిల్లాలు పరువు పొరలు చిక్కుకున్నాయని 111 జిల్లాలు అధికారులు జిల్లాలుగా ప్రకటించడం జరిగిందన్నారు అయినా ప్రభుత్వం రైతుల విషయంలో ఏమాత్రం పట్టించుకోవడంలేదని ఆందోళన వ్యక్తపరిచారు. కరువు నిధిని ఏర్పాటు చేసి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.