22 July, 2026 | 3:54 PM

Breaking News

ఎస్‌ఐఆర్ కమిటీతో కేటీఆర్ సమీక్ష   •   ఐఐటీ మద్రాస్‌లో ఎం.టెక్ సీటు సాధించిన మోకాళ్ల భాను ప్రసాద్‌కు అభినందనలు   •   ప్రమాద భరితంగా మోడల్ స్కూల్ భవనం..!   •   ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డి పిటిషన్ వాయిదా   •   రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ ఇల్లందులో రాస్తారోకో..   •   విద్యార్థుల స్కాలర్‌షిప్‌ కొరకు దరఖాస్తుల ఆహ్వానం.!   •   నాచారం ఎస్ఐ ఫ్రాన్సిస్‌కు సీపీ రివార్డ్   •   బోయినపల్లి వినోద్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా   •   కాక్రోచ్ పార్టీ ఆందోళన ఎఫెక్ట్.. 16 ఢిల్లీ మెట్రో స్టేషన్లు మూసివేత   •   శాంతినగర్‌లో 'వజ్రం ప్యూర్ ఫైర్' శుద్ధ జల కేంద్రం ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజర్షిషా..   •  

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవు

20-02-2026 02:22 PM

కొల్లాపూర్ మున్సిపల్ చైర్మన్ రెడ్డి జ్యోతి

కొల్లాపూర్ టౌన్: కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఆరో వార్డులో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను శుక్రవారం కొల్లాపూర్ మున్సిపల్ చైర్మన్ రెడ్డి జ్యోతి టెంకాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నాణ్యత   లోపం లేకుండా పనులు చేపట్టాలని మేస్త్రీలకు సూచించారు. నాణ్యత విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ నిరుపేదల సంక్షేమం వారి అభివృద్ధి కోసం కట్టుబడి ఉంటుందని తెలిపారు. పార్టీలకు అతీతంగా నిజమైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లను జూపల్లి కృష్ణా రావు ఆధ్వర్యంలో మంజూరు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ షేక్ రహీం భాషా, మాజీ కౌన్సిలర్ బరిగెల రాముడు యాదవ్, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు అధికారులు పాల్గొన్నారు.