2 March, 2026 | 7:39 PM

ఐక్యతతో ముందుకు సాగాలి

02-03-2026 05:44 PM

– జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ నాయకులు

కోనరావుపేట,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ పరిధిలోని కోనరావుపేట మండలం కొండాపూర్ గ్రామంలోని గుడ్ న్యూస్ బాప్టిస్ట్ చర్చ్ లో కోనరావుపేట మండలం పాస్టర్స్ అసోసియేషన్ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జీవన్, జిల్లా ప్రధాన కార్యదర్శి కుమ్మరి రాజేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... నూతన కమిటీ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని మండలాల పాస్టర్లను ఏకతాటిపైకి తీసుకువెళ్లి ఐక్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

జిల్లాలోని ప్రతి మండలాన్ని సందర్శిస్తూ పాస్టర్లను ఆధ్యాత్మికంగా ప్రోత్సహించడంతో పాటు సంఘాల అభివృద్ధికి ప్రభుత్వం తరఫున సహకరించేలా కృషి చేస్తామని తెలిపారు. మండలానికి వచ్చిన జిల్లా కమిటీ సభ్యులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో జిల్లా ట్రెజరర్ ప్రభుదాస్, జాయింట్ సెక్రటరీ జోసెఫ్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ అహరోను, జిల్లా మీడియా కన్వీనర్ కులేరి కిషోర్ కుమార్, మండల అసోసియేషన్ అధ్యక్షుడు జోసెఫ్, సీనియర్ పాస్టర్లు పౌల్, విద్యానందం, ఏసురత్నం, అనిల్, మోషేతో పాటు కోనరావుపేట మండలంలోని అన్ని గ్రామాల పాస్టర్లు పాల్గొన్నారు.