18 May, 2026 | 12:56 AM

కాలం

18-05-2026 12:00 AM

కాలం చిత్ర విచిత్రమైన ఒక వైకుంఠపాళి 

కొందరిని కాల గర్భంలో కలిపేస్తుంది

కొంతమందిని ఆకాశమే హద్దుగా 

ఎదిగేలా వెన్నుతడుతుంది 

కాలం అందరికీ సమానం

నిమిషమంటే అరవై సెకన్లు

గంటకు అరవై నిమిషాలు 

ఇరవై నాలుగు గంటలకు ఒకరోజు 

ముప్పు రోజులకు ఒక నెల 

పన్నెండు నెలలకు ఒక సంవత్సరం 

ఆ ఏడాదిలో వేసవి, వానకాలం, చలికాలాలు

మనిషి చిత్తంలో భూత భవిష్యత్తు 

వర్తమానాల భ్రమలు

ఆలోచిస్తే.. ఎవరికీ అర్థంకాని 

ఒక రసాయనశాల కాలం

ఈ మాయాకాలం.. సామాన్యులను 

నాయకులను చేస్తుంది

మళ్లీ ఆ నాయకులనే ప్రజలకు 

దూరం చేస్తుంది

కొందరిని హంతకులుగా మారుస్తుంది 

మరికొందరిని నిర్దోషులుగా నిలుపుతుంది

పుణ్యం.. పాపం.. శాపమని మనిషి 

ఏ పేరు పెట్టుకున్నా

తన పని తాను చేసుకుంటూ పోతుంది 

ఏదేమైనా.. మరుపు కాలం మనకిచ్చిన వరం 

కాలాన్ని నిందిస్తూ కూర్చోవడం కన్నా 

దానిని సద్వినియోగం చేసుకోవడమే మిన్న !!