17 May, 2026 | 7:43 PM

నేటి యువతకు స్ఫూర్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్

17-05-2026 06:27 PM

బోడుప్పల్ లో 378వ వారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు జ్ఞానమాల

 అంబేద్కర్ ఆశయ సాధన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, నత్తి మైసయ్య

మేడిపల్లి,(విజయక్రాంతి): అంబేద్కర్ జీవితాన్ని నేటి యువత స్ఫూర్తిగా తీసుకొని సమాజంలో అత్యుత్తమ పౌరులుగా ఎదగాలని, సమాజ నిర్మాణంలో భాగం కావాలని, అంబేద్కర్ ఆశయ సాధన సంఘం రాష్ట్ర అధ్యక్షులు నత్తి మైసయ్య పిలుపునిచ్చారు. ఆదివారం నత్తి మైసయ్య ఆధ్వర్యంలో బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి 378వ జ్ఞానమాల సమర్పించి, భారత రాజ్యాంగ నిర్మాణం కోసం అంబేద్కర్ చేసిన సేవలను స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా నత్తి మైసయ్య మాట్లాడుతూ... నిరుపేద దళిత కుటుంబంలో పుట్టి ఎలాంటి అవకాశాలు లేకున్నా ఎన్నో అవరోధాలను, ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కొని, స్వశక్తితో వీధి దీపాల కింద చదివి తన మేధస్సును పెంచుకుని, ప్రపంచంలోనే అత్యుత్తమ విజ్ఞానవంతుడిగా పేరు సంపాదించి, విజ్ఞానంతో పేదరికం జయించవచ్చని ప్రపంచానికి చాటిన మహానీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని, అంతేకాకుండా తన మేధస్సును భారత రాజ్యాంగం కోసం వినియోగించి అత్యుత్తమ భారత రాజ్యాంగాన్ని భారతీయులకు అందించిన గొప్ప వ్యక్తి బాబా సాహెబ్ అంబేద్కర్ అని, అలాంటి మహనీయుని జీవితాన్ని నేటి యువత స్ఫూర్తిగా తీసుకొని సమాజంలో అత్యుత్తమ పౌరులుగా ఎదగాలని, సమాజ నిర్మాణంలో భాగం కావాలని నత్తి మైసయ్య  పిలుపునిచ్చారు.