జిల్లా ఎస్పీ నర్సింహకు రాఖీలు కట్టిన కిట్స్ కళాశాల విద్యార్థినులు
19-08-2026 08:10 PM
కోదాడ,(విజయక్రాంతి): కోదాడలోని మేళ్ళచెర్వు కాశీనాధం ఫంక్షన్ హాల్‌లో బుధవారం నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన జిల్లా ఎస్పీ నర్సింహకు కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినులు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థినులు జిల్లా ఎస్పీకి రక్షాబంధన్‌లు కట్టి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కిట్స్ కళాశాల విద్యార్థినులు, అధ్యాపకులు పాల్గొన్నారు.






